కుర్రాళ్లు కసికసిగా..టీమ్‌ఇండియాకు కఠిన పరీక్ష

Wed,November 6, 2019 05:18 PM

రాజ్‌కోట్: భారత్, బంగ్లాదేశ్ మధ్య గురువారం రాజ్‌కోట్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు రేపటి మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాయి. టీమ్‌ఇండియా యువ క్రికెటర్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ చాలాసేపు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఆటగాళ్లందరూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో కోచ్‌ల పర్యవేక్షణలో సాధన చేశారు. తొలి టీ20లో అనూహ్యంగా ఓటమిపాలైన భారత్ రెండో టీ20లో ఎలాగైనా గెలువాలని పట్టుదలతో ఉంది. తొలి టీ20లో బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో ఓ మోస్తరు స్కోరుకే రోహిత్ సేన పరిమితమైంది. అనంతరం ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలోనూ విఫలమైంది. భారత్‌పై చక్కటి ప్రదర్శన కనబర్చిన బంగ్లా టైగర్స్ మరో విజయంపై కన్నేసింది.


తీవ్ర వాయు కాలుష్యం నడుమ మందకొడి పిచ్‌పై ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లా చేతిలో ఓడింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. టీ20 చరిత్రలో భారత్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది వెయ్యవ టీ20 మ్యాచ్ కావడం మరో విశేషం.2731
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles