‘గబ్బర్‌’ పేరు అలా వచ్చింది: శిఖ‌ర్ వీడియో

Sun,May 27, 2018 06:16 PM

Shikhar Dhawan reveals story behind Gabbar, recalls when he was about to quit cricket

ముంబయి: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను క్రికెట్ అభిమానులు ముద్దుగా గబ్బర్ అని పిలుస్తారన్న విషయం మనకు తెలిసిందే. నిక్‌నేమ్ గబ్బర్ ప్రస్తుతం బాగా పాపులర్ అయిందని.. నా అసలు పేరు శిఖర్ అని కాకుండా ప్రతిఒక్కరూ గబ్బర్ అని పిలుస్తారని.. ప్రముఖ యాంకర్ గౌరవ్ కపూర్ ఆధ్వ‌ర్యంలో వ‌స్తున్న‌ వెబ్ సిరీస్ 'బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్' కార్యక్రమంలో ధావన్ ఈ విషయం చెప్పాడు.

ధావన్ ఏమన్నాడంటే.. ఢిల్లీ కెప్టెన్ విజయ్ దాహియా నాకు గబ్బర్ అని పేరుపెట్టాడు. రంజీ మ్యాచ్‌లు ఆడేటప్పుడు ఫేమస్ బాలీవుడ్ విలన్ల డైలాగులను నేను ఎక్కువగా చెప్పేవాడిని. ఒకానొక దశలో క్రికెట్‌ను వదిలేద్దామని కూడా నిర్ణయించుకున్నాను. క్రికెట్ కెరీర్ ఆరంభంలోనే నా పనైపోయిందని భావించి..చివరికి నా తండ్రి వ్యాపారాన్ని చూసుకోవాలని అనుకున్నా. టీమ్‌లో స్థానం ఉందని..తిరిగి వచ్చి జట్టులో చేరాలని తన కోచ్ మరో అవకాశం ఇచ్చాడని ధావన్ పేర్కొన్నాడు.

ధావన్‌తో ముచ్చట కొనసాగుతుండగానే తన భార్య అయేషా ముఖర్జీ, తన ముద్దుల తనయుడు జోరావర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. తన భార్యే తన బలమని శిఖర్ చెప్పాడు. ఈ సందర్భంగా తమ జీవితంలోని మధురానుభూతులను, ఆసక్తికర విషయాలను కపూర్‌తో పంచుకున్నారు.

4180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS