ముందు నీ దేశం సంగతి చూసుకో.. ఈసారి ధావన్ వంతు!

Thu,April 5, 2018 05:13 PM

Shikhar Dhawan reacts strongly to Shahid Afridis Kashmir Comments

న్యూఢిల్లీ: కశ్మీర్ అంశాన్ని అనవసరంగా కెలికి టీమిండియా క్రికెటర్ల ఆగ్రహానికి గురవుతున్నాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అఫ్రిది వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా చాలా ఘాటుగా స్పందించాడు. ముందు నీ దేశం పరిస్థితిని చక్కదిద్దుకో. నీ ఆలోచన నీ దగ్గరే పెట్టుకో. మా దేశం కోసం మేం బాగానే చేస్తున్నాం. భవిష్యత్తులోనూ ఏం చేయాలో మాకు బాగా తెలుసు. మా గురించి ఎక్కువగా ఆలోచించకు అంటూ అఫ్రిదికి దిమ్మదిరిగే సమాధానమిచ్చాడు. లెజెండరీ క్రికెటర్స్ కపిల్, సచిన్‌తోపాటు గంభీర్, కోహ్లి, రైనాలాంటి వాళ్లు అఫ్రిది కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.


4137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles