కోహ్లీసేన‌కు షాక్‌..వరల్డ్‌కప్ నుంచి ధావన్ ఔట్

Wed,June 19, 2019 04:57 PM

Shikhar Dhawan out of World Cup 2019, Rishabh Pant named replacement

లండన్: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియాకు ఎదురుదెబ్బ. గాయపడ్డ శిఖర్ ధావన్ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకునే సూచనలు కన్పించకపోవడంతో అతని స్థానంలో ఇంకో ఆటగాడిని తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ‌బ్బ‌ర్ స్థానంలో రిషబ్ పంత్‌ను అధికారికంగా తుదిజట్టుకు ఎంపిక చేశారు. పంత్ ఎంపిక‌ను బీసీసీఐ..ఐసీసీకి తెలిపింది. పంత్ ఇప్పటికే ఇంగ్లాండ్‌కు వచ్చి జట్టుతో పాటు సాధన చేస్తున్నాడు.

ఈనెల 9న‌ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కౌల్టర్ నైల్ వేసిన షార్ట్ పిచ్ బంతి ధావన్ బొటన వేలికి బలంగా తాకింది. ప్రాథమిక చికిత్స తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు. ప్ర‌స్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు.
6822
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles