గబ్బర్ వచ్చేశాడు.. వెస్టిండీస్ టూర్‌కు నేడు భారత జట్టు ఎంపిక..

Sun,July 21, 2019 11:11 AM

ఢిల్లీ: ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ తన ఎడమ చేతి బొటనవేలుకు హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అవడం వల్ల వరల్డ్ కప్ టోర్నీ మొత్తానికే దూరమైన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ 109 బంతుల్లో 117 పరుగులు చేయడంతో టీమిండియా ఆసీస్‌పై 36 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఆ మ్యాచ్‌లో ప్యాట్ కమ్మిన్స్ వేసిన బౌన్సర్ ధావన్ వేలికి తాకడంతో అతను గాయం పాలయ్యాడు. అయినా గాయంతోనే మ్యాచ్‌ను ముగించాడు. అయితే వేలికి హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అవడం వల్ల ధావన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.


కాగా దాదాపుగా నెల రోజులకు పైగా గ్యాప్ అనంతరం ధావన్ ఇప్పుడే పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. మూడు రోజుల కిందట గబ్బర్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల వైరల్ అవుతున్న బాటిల్ క్యాప్ చాలెంజ్‌ను స్వీకరించిన గబ్బర్ బంతిని స్ట్రెయిట్ డ్రైవ్ ఆడి దాంతో బాటిల్ క్యాప్ పడగొట్టాడు. కాగా ఆ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. ఇక ధావన్ ఫిట్‌నెస్ సాధించడంతో విండీస్ టూర్‌కు అతన్ని సెలెక్టర్లు దాదాపుగా జట్టులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేటి మధ్యాహ్నం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ ప్యానెల్ విండీస్ టూర్‌కు వెళ్లబోయే భారత జట్టును ప్రకటించనుంది.

3010
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles