కోహ్లి తర్వాత శిఖర్ ధావనే!

Wed,January 23, 2019 12:41 PM

Shikhar Dhawan becomes second fastest Indian to reach 5000 ODI runs

నేపియర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఓ రికార్డు సాధించాడు. వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి తర్వాత అత్యంత వేగంగా 5 వేల పరుగులు చేసిన టీమిండియా బ్యాట్స్‌మన్‌గా ధావన్ నిలిచాడు. కోహ్లి 114 మ్యాచుల్లో 5 వేల పరుగుల మైల్‌స్టోన్‌ను అందుకోగా.. ధావన్ 118 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు. మ్యాచ్‌కు ముందు పది పరుగుల దూరంలో ఉన్న శిఖర్.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో టిమ్ సౌథీ బౌలింగ్‌లో సింగిల్ తీసి 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. హషీమ్ ఆమ్లా (101 మ్యాచ్‌లు), వివ్ రిచర్డ్స్ (114), కోహ్లి (114) తొలి మూడు స్థానాల్లో ఉండగా.. బ్రయాన్ లారా (118)తో కలిసి ధావన్ నాలుగోస్థానంలో ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ విషయానికి వస్తే గంగూలీ, గ్రేమ్ స్మిత్‌లను దాటేసి లారాతో కలిసి తొలి స్థానంలో నిలిచాడు ధావన్. 2010లో ఆస్ట్రేలియాపై వన్డే అరంగేట్రం చేసిన శిఖర్ ధావన్ ఇప్పటివరకు 15 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు చేశాడు.


4203
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles