ప్రాక్టీస్ సెషన్‌లో ధావన్ ఇలా..: వీడియో

Wed,June 12, 2019 05:47 PM

Shikhar Dhawan at Indias practice session at Trent Bridge

నాటింగ్‌హామ్: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సహచర ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సాధన చేస్తుండగా గబ్బర్ మాత్రం సరదాగా కాలక్షేపం చేశాడు.

ఆదివారం ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పాట్ క‌మిన్స్ వేసిన బౌన్సర్‌ను అడ్డుకునే క్రమంలో ధావ‌న్‌ గాయపడ్డాడు. ఎడమ చేతి బొటన వేలుకు బంతి బలంగా తాకడంతో ఫీల్డింగ్‌కు రాకుండా డ్రెస్సింగ్‌రూమ్‌కే పరిమితమయ్యాడు. వైద్యపరీక్షల్లో అతడి బొటనవేలి ఎముకలో సన్నటి చీలిక వచ్చినట్లు తేలింది. దీంతో అత‌డు రెండు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు.1825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles