ముర‌ళీ విజ‌య్ స్థానంలో శిఖ‌ర్ ధావ‌న్‌

Mon,July 17, 2017 04:08 PM

Shikar Dhawan replaces injured Murali Vijay for Sri Lanka tour

ముంబై: శ‌్రీలంక టూర్‌కు ఓపెన‌ర్ ముర‌ళీ విజ‌య్ స్థానంలో టీమ్‌లోకి వ‌చ్చాడు శిఖ‌ర్ ధావ‌న్‌. ఆస్ట్రేలియాతో సిరీస్ సంద‌ర్భంగా విజ‌య్‌కు మ‌ణిక‌ట్టు గాయ‌మైంది. ఇప్ప‌టికీ దాన్నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదత‌డు. ఈ మ‌ధ్యే స‌న్నాహ‌క మ్యాచ్‌లో కుడిచేతి మ‌ణిక‌ట్టు నొప్పిగా ఉంద‌ని విజ‌య్ చెప్ప‌డంతో అత‌ని స్థానంలో శ్రీలంక టూర్‌కు ధావ‌న్‌ను ఎంపిక చేశారు. చాంపియ‌న్స్ ట్రోఫీలో ధావ‌న్ రాణించ‌డంతో ఓపెన‌ర్‌గా అత‌నికే చాన్స్ ద‌క్కింది. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా బీసీసీఐ వెల్ల‌డించింది.


ఇప్ప‌టివ‌ర‌కు 23 టెస్టులాడిన ధావ‌న్ 38.52 స‌గ‌టుతో 1464 ర‌న్స్ చేశాడు. అందులో నాలుగు సెంచ‌రీలు ఉన్నాయి. గ‌తేడాది న్యూజిలాండ్‌తో జ‌రిగిన సిరీస్‌లో చివ‌రిసారి టెస్ట్ మ్యాచ్ ఆడాడు ధావ‌న్‌. ఈ నెల 21 నుంచి శ్రీలంక‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్ మొద‌ల‌వ‌నుంది. టెస్ట్ సిరీస్ త‌ర్వాత ఐదు వ‌న్డేలు, ఒక టీ20 ఆడాల్సి ఉంది.

3150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles