వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఇదీ క్యాచ్ ఆఫ్ ద వీక్ - వీడియో

Tue,June 11, 2019 12:32 PM

Sheldon Cottrells catch to dismiss Steven Smith is best fielding moment

హైద‌రాబాద్: ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇప్ప‌టికే 15 మ్యాచ్‌లు ముగిశాయి. టోర్నీలో ఇప్ప‌టికే ఎన్నో అద్భుతాలు చోటుచేసుకున్నాయి. బ్యాట్స్‌మెన్లు, బౌల‌ర్లు త‌మ స‌త్తా చాటారు. కొంద‌రు ఫీల్డింగ్‌లోనూ అదుర్స్ అనిపించారు. కొంద‌రు ప్లేయ‌ర్ల‌పై సోష‌ల్ మీడియాలో పుకార్లు కూడా వెల్లువెత్తాయి. మే 30వ తేదీన మొద‌లైన వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన కొన్ని ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌ల‌ను స‌మీక్షిద్దాం.

ఇన్నింగ్స్ ఆఫ్ ద వీక్‌.. సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియ‌న్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ 122 ర‌న్స్ చేశాడు. అయితే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన సౌంతాప్ట‌న్ పిచ్‌పై రోహిత్ సెంచ‌రీ కొట్ట‌డం విశేషం. అది కూడా స‌ఫారీ స్పీడ్ బంతుల‌ను రోహిత్ ఎదుర్కొన్న తీరు ప్ర‌శంస‌నీయం.

స్పెల్ ఆఫ్ ద వీక్‌.. ఆస్ట్రేలియా స్పీడ్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్ త‌న స్వింగ్ మంత్రాన్ని మ‌రోసారి ప్ర‌యోగించాడు. వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌ను 46 ప‌రుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు. బౌన్స‌ర్ల‌కు మారుపేరైన స్టార్క్‌.. ఆ మ్యాచ్‌లో గేల్‌, హోల్డ‌ర్‌, ర‌స్స‌ల్‌, బ్రాత్‌వెయిట్‌, కార్టెల్ వికెట్ల‌ను తీశాడు. త‌న బౌలింగ్‌లో స్వింగ్‌, బౌన్స త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు. 77 వ‌న్డేల్లోనే 150 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు.

ఫీల్డింగ్ ఆఫ్ ద వీక్‌.. విండీస్ ప్లేయ‌ర్ షెల్డ‌న్ కాట్రెల్ అద్భుత‌మైన ఫీల్డింగ్ ప్ర‌ద‌ర్శించాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ కొట్టిన భారీ షాట్‌ను.. ప‌రుగెత్తుకుంటూ వెళ్లి బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఒంటి చేతితో కాట్రెల్ అందుకున్నాడు. ఆ క్యాచ్ వీడియోను మ‌రోసారి చూడిండి.

ఫోర్క్ మూమెంట్ ఆఫ్ ద వీక్‌.. ఇంగ్లండ్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ వేసిన ఓ బంతి .. వికెట్ల‌ను తాకి బౌండ‌రీ చేరుకున్న‌ది. ఇది మ‌రీ విచిత్రంగా అనిపిస్తుంది. ఆ బంతికి సౌమ్య స‌ర్కార్‌ ఔట‌య్యాడు. అయితే బంతి వికెట్ల‌పై ఉన్న బెయిల్స్‌కు తాకి.. అది కీప‌ర్ మీదుగా బౌండ‌రీ లైన్ వ‌ద్ద ప‌డింది. వికెట్ల‌కు తాకిన త‌ర్వాత ఆ బంతి అంత దూరం ఎలా వెళ్లి ప‌డిందో అర్థం కావ‌డం లేదు.

సోష‌ల్ మీడియా బ‌జ్ ఆఫ్ ద వీక్‌.. ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ ఆడ‌మ్ జంపా.. బంతిని ట్యాంప‌ర్ చేశాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇండియాతో జ‌రిగిన మ్యాచ్‌లో.. జంపా శ్యాండ్ పేప‌ర్ వాడాడ‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

3133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles