ఈడెన్‌లో గంట మోగించిన హసీనా, మమతా

Fri,November 22, 2019 01:40 PM

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ అట్టహాసంగా ఆరంభమైంది. టీమ్‌ఇండియా మొదటి సారి గులాబీ బంతితో ఆడుతున్న టెస్టుకు బీసీసీఐ భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ చారిత్రక టెస్టుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడెన్‌లో ఏర్పాటు చేసిన గంటను వీరిద్దరూ కలిసి మోగించి మ్యాచ్‌ను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తదితరులు పాల్గొన్నారు.636
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles