ఆసీస్ అసాధారణ పోరాటం.. రాంచీ టెస్ట్ డ్రాMon,March 20, 2017 04:23 PM
ఆసీస్ అసాధారణ పోరాటం.. రాంచీ టెస్ట్ డ్రా

రాంచీ: ఆస్ట్రేలియా అసాధార‌ణంగా పోరాడింది. విజయం ఖాయ‌మ‌నుకున్న టీమిండియా ఆశ‌లపై నీళ్లు చ‌ల్లింది. చివ‌రిరోజు స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ఆసీస్ బ్యాట్స్‌మెన్ పీట‌ర్ హ్యాండ్స్‌కాంబ్‌, షాన్ మార్ష్ తెగువ చూపించారు. 62 ఓవ‌ర్ల పాటు ఊపుమీదున్న భార‌త బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఒక ద‌శ‌లో 63 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి ఓట‌మివైపు చూస్తున్న ఆసీస్‌ను ఈ ఇద్ద‌రూ ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 124 ర‌న్స్ జోడించారు. మార్ష్ 53 ర‌న్స్ చేసి జ‌డేజా బౌలింగ్‌లో ఔటైనా.. అప్ప‌టికే చేయాల్సిన న‌ష్ట‌మంతా చేసేశాడు. రెండు సెష‌న్ల పాటు ఈ ఇద్ద‌రూ వికెట్ ఇవ్వ‌కుండా భార‌త బౌల‌ర్ల స‌హనాన్ని ప‌రీక్షించారు. టెస్టుల్లో నంబ‌ర్ వ‌న్ జోడీ అశ్విన్‌, జ‌డేజాలు కూడా ఈ జోడీని విడ‌దీయ‌డానికి కిందామీదా ప‌డ్డారు. ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్లకు 204 రన్స్ చేసింది. హ్యాండ్స్ కాంబ్ 72 రన్స్ తో అజేయంగా నిలిచాడు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో ఇప్పటికీ సమంగానే ఉంది. 2010 తర్వాత భారత గడ్డపై తొలి ఇన్నింగ్స్ లో వెనుకబడి చివరికి మ్యాచ్ డ్రా చేసుకున్న విదేశీ జట్టు ఆస్ట్రేలియానే. డబుల్ సెంచరీ చేసిన పుజారకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

లంచ్‌కు ముందు వ‌ర‌కు ఆసీస్ ప‌రిస్థితి చూస్తే.. టీమిండియా విజ‌యం ఖాయ‌మ‌నే అనుకున్నారంతా. చివ‌రి రోజు 2 వికెట్ల‌కు 23 ప‌రుగుల ఓవ‌ర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొన‌సాగించిన ఆసీస్‌.. తొలి గంట‌న్న‌ర‌సేపు వికెట్ ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డింది. రెన్షా, స్మిత్ భార‌త బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నారు. అయితే రెన్షా(15)ను ఇషాంత్ వెన‌క్కి పంప‌డంతో వీళ్ల జోడీకి బ్రేక్ ప‌డింది. ఆ త‌ర్వాతి ఓవ‌ర్లోనే జ‌డేజా.. డేంజ‌ర‌స్ స్మిత్‌ను ఓ అద్భుత‌మైన బంతితో బోల్తా కొట్టించాడు. ఈ ద‌శలో ఆసీస్ కుప్ప‌కూలుతుంద‌ని, భార‌త్‌కు సిరీస్‌లో 2-1 లీడ్ ఖాయ‌మ‌నే భావించారు. కానీ అక్క‌డి నుంచి షాన్ మార్ష్‌, హ్యాండ్స్‌కాంబ్ హ‌వా మొద‌లైంది. ఒక్కో ఓవ‌ర్ ఆడుతూ వెళ్లిపోయారు. దీంతో రెండో సెష‌న్‌లో భార‌త్ ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయింది. విరాట్ ఎన్నిసార్లు బౌల‌ర్లను మార్చినా ఫలితం లేక‌పోయింది. స్టార్ స్పిన్న‌ర్ అశ్విన్ అయితే తేలిపోయాడు. అత‌ను కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు.

2109
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS