పాంటింగ్‌ను ఐపీఎల్‌ నుంచి త‌ప్పించాల‌ని కోర‌లేదు..!

Fri,February 15, 2019 03:08 PM

Shane Warne did not call for Ricky Ponting to be banned from IPL 2019

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆసీస్ స్పిన్ గ్రేట్ షేన్ వార్న్ తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రధాన కోచ్‌గా ఉన్న పాంటింగ్‌ను తప్పించాలంటూ తాను బీసీసీఐని కోరినట్లు వస్తున్న వార్తలు పుకార్లేనని స్పష్టం చేశాడు.

ట్విటర్‌లో షేన్ వార్న్ స్పందిస్తూ.. ఐపీఎల్ నుంచి పాంటింగ్‌ను బ్యాన్ చేయాలని నేను వ్యాఖ్యానించినట్లు వస్తున్న కథనాలు పూర్తిగా అసత్యమైనవి. వాటిని ప్రచారం చేయడం ఆపండి. ఆస్ట్రేలియా టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైనందున ఢిల్లీకి కోచింగ్ ఇవ్వకుండా అతన్ని అడ్డుకోవాలని బీసీసీఐ భావిస్తే అది కచ్చితంగా అవివేకమైన చర్య. ఒకవేళ బీసీసీఐ అలాంటి చర్యలు తీసుకుంటే. పాంటింగ్ అంగీకరించాల్సి ఉంటుంది. అని వార్న్ ట్వీట్ చేశాడు.

త్వరలో వరల్డ్ కప్‌కు వెళ్లే ఆస్ట్రేలియా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పాంటింగ్‌ను ఆస్ట్రేలియా నియమించిన విషయం తెలిసిందే. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద పాంటింగ్ తప్పుకోవాలని బీసీసీఐ ఆదేశిస్తే దానికి అతడు అంగీకరించాల్సి ఉంటుందని వార్న్ అభిప్రాయపడ్డాడు.

862
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles