రన్‌మెషీన్ షకీబ్ హాఫ్‌సెంచరీ

Mon,June 24, 2019 05:09 PM

Shakib,  Mushfiqur Continue to Build

సౌతాంప్టన్: ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ జోరు కొనసాగుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న షకీబ్ అఫ్గనిస్థాన్‌తో మ్యాచ్‌లో అర్ధశతకంతో రాణించాడు. నైబ్ వేసిన 28వ ఓవర్ ఐదో బంతికి సింగిల్ తీసి 50 మార్క్ చేరుకున్నాడు. 82 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాను షకీబ్ నిలకడగా ఆడుతూ ఆదుకున్నాడు. వన్డే కెరీర్‌లో అతనికిది 45వ హాఫ్‌సెంచరీ కాగా.. మెగా టోర్నీలో 50కి పైగా స్కోరు చేయడం ఐదోసారి కావడం విశేషం. మైదానం ఎక్కడైనా, ప్రత్యర్థి ఎవరైనా పరుగులే చేయడమే లక్ష్యంగా అతడి బ్యాటింగ్ సాగుతోంది. భారీ స్కోరు దిశగా సాగుతున్న షకీబ్(51) ముజీబ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles