డ్రెస్సింగ్ రూమ్ అద్దం పగులగొట్టింది బంగ్లా కెప్టెనే..?

Wed,March 21, 2018 11:14 AM

Shakib Al Hasan behind broken dressing room door in Colomboకొలంబో: నిదహాస్ ట్రోఫీ ముక్కోణపు టీ20 సిరీస్ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య మ్యాచ్ ఆఖర్లో ఇరు జట్ల ఆటగాళ్లు వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. లంక బౌలర్ ఉదాన వరుసగా రెండో బంతిని భుజాని కన్నా ఎక్కువ ఎత్తులో వేసినప్పటికీ అంపైర్ నోబాల్‌గా ప్రకటించకపోవడంతో పెవిలియన్ నుంచి బౌండరీలైన్ వద్దకు వచ్చిన బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ బ్యాట్స్‌మెన్లు మైదానం నుంచి వచ్చేయాలని సూచించడంతో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఉత్కంఠ పోరులో బంగ్లా గెలుపొందిన అనంతరం ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్ అద్దం పగలడంతో ఐసీసీ మ్యాచ్ క్రిస్ బ్రాడ్ విచారణ జరిపారు. అక్కడున్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యం రికార్డు కాకపోవడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. బంగ్లా ఆటగాళ్లకు క్యాటరింగ్ చేసిన సిబ్బందిలో ఒకరు ఈ ఘటనకు పాల్పడింది షకిబేనని వెల్లడించినట్లు సమాచారం. మైదానంలో దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద షకిబ్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ నురుల్ హసన్‌కు మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధించడంతో పాటు చెరో డీమెరిట్ పాయింట్‌ను ఇప్పటికే ఇచ్చిన విషయం తెలిసిందే.

2410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles