కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్ క్రికెటర్.. ఆడుకున్న ట్విట్టర్!

Tue,April 3, 2018 04:42 PM

shahid Afridi raises Kashmir issue again and Twitter is not happy

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తాడు. అంతేకాదు భారత ఆక్రమిత కశ్మీర్ అంటూ నోరు కూడా జారాడు. స్వీయ నిర్ణయాధికారం, స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేస్తున్న వారిని అణిచేస్తున్నారని అఫ్రిది ట్వీట్ చేశాడు. ఇంత జరుగుతున్నా ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఎక్కడ అంటూ ప్రశ్నించాడు. ఈ రక్తపాతాన్ని ఎందుకు ఆపడం లేదంటూ ప్రశ్నించాడు. కశ్మీర్ లోయలో 13 మంది ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టిన రెండు రోజుల తర్వాత అఫ్రిది ఈ ట్వీట్ చేయడం గమనార్హం.


అఫ్రిది కశ్మీర్ ఇష్యూని లేవనెత్తడం ఇదే తొలిసారి కాదు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తమకు మద్దతు ఇచ్చిన కశ్మీరీలకు కృతజ్ఞతలంటూ అఫ్రిది అనడం పెద్ద వివాదమైంది. అయితే తాజాగా అతను చేసిన ట్వీట్‌పై ట్విట్టర్ తీవ్రంగా మండిపడింది. ఓ మంచి పేరున్న క్రికెటర్‌గా పక్క దేశం గురించి పట్టించుకోవడం మానేసి.. పాకిస్థాన్ గురించి ఆలోచించు అంటూ సొంత దేశం అభిమానులు కూడా అఫ్రిదికి గడ్డి పెట్టారు. విరాట్ కోహ్లి ఎప్పుడైనా పాక్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై స్పందించాడా అంటూ మరొకరు ప్రశ్నించారు.
3815
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles