పాకిస్థాన్‌ను నిషేధించలేం.. ఆ పని మాది కాదు!

Sun,March 3, 2019 01:44 PM

Severing cricket ties with countries not our domain says ICC

దుబాయ్: బీసీసీఐకి షాక్ తగిలింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలతో సంబంధం తెంచుకోవాలన్న బోర్డు ప్రతిపాదనను ఐసీసీ తోసిపుచ్చింది. ఇలాంటి విషయాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. పుల్వామా దాడి నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలతో సంబంధాలు తెంచుకోవాలంటూ పరోక్షంగా పాకిస్థాన్‌ను ప్రస్తావిస్తూ ఐసీసీకి బీసీసీఐ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటిది చేసే అవకాశం అస్సలు లేదు. దేశాలపై నిషేధం అన్నది ప్రభుత్వాల స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం తప్ప ఇందులో ఐసీసీకి ఎలాంటి సంబంధం లేదని ఐసీసీ చైర్మన్ స్పష్టం చేశారు. బీసీసీఐకి ముందే ఈ విషయం తెలిసినా.. లేఖ రాసింది అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. బీసీసీఐ తన లేఖలో నేరుగా పాకిస్థాన్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీనిపై ఐసీసీ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినా.. సభ్యులెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. బోర్డు తరఫున ఈ సమావేశానికి సెక్రటరీ అమితాబ్ చౌదరి హాజరయ్యారు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఎంతో మంది విదేశీ ప్లేయర్స్ ఆడుతున్నా.. ఎవరూ ఇలాంటి ఫిర్యాదు చేయలేదు. భద్రత కీలకమైనదే అయినా.. దీనిపై పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉన్నాం అని ఐసీసీ అధికారి చెప్పారు. ఐసీసీ వరల్డ్‌కప్‌లో భాగంగా జూన్ 16న పాకిస్థాన్‌తో ఇండియా ఆడనుంది. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆడాలా వద్దా అన్నదానిపై ఇండియా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

3250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles