పాక్‌తో సంబంధాలు కట్ చేసుకోండి.. ఐసీసీకి బీసీసీఐ లేఖ

Fri,February 22, 2019 03:25 PM

Sever the ties with the nations which are terrorists hub BCCI writes to ICC

ముంబై: ఊహించిందే జరిగింది. ఉగ్రవాద దేశాలతో సంబంధాలు తెంపుకోవాలంటూ ఐసీసీకి బీసీసీఐ లేఖ రాయాలని నిర్ణయించింది. వరల్డ్‌కప్‌లో భాగంగా జూన్ 16న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఆడాలా వద్దా అన్న అంశంపై చర్చించడానికి శుక్రవారం బీసీసీఐ, సీఓఏ సమావేశమైంది. సమావేశం తర్వాత సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ మీడియాతో మాట్లాడారు. మేము ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. జూన్ 16 మ్యాచ్‌పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఐసీసీకి ప్రధానంగా రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాం.


టోర్నీ సందర్భంగా ఆటగాళ్లకు మరింత భద్రత కల్పించాలని, ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న దేశాలతో సంబంధాలు తెంపుకోవాలని ఐసీసీని కోరుతున్నాం. హోంమంత్రి వ్యాఖ్యలపై నేనేమీ స్పందించను. జూన్ 16కు ఇంకా చాలా రోజులు ఉంది. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం అని వినోద్ రాయ్ వెల్లడించారు. పాక్‌తో ఇండియా ఆడాలా వద్ద అన్న అంశంపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హర్భజన్, గంగూలీలాంటి ప్లేయర్స్ అసలు వద్దని వారిస్తుండగా.. దాని వల్ల మనకే నష్టమని గవాస్కర్, చేతన్ చౌహాన్‌లాంటి ప్లేయర్స్ అభిప్రాయపడ్డారు.

1575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles