సెరీనా విలియ‌మ్స్ @ 308

Tue,September 6, 2016 08:41 AM

Serena Williams wins 308 Grand Slam match

న్యూయార్క్ : టెన్నిస్ స్టార్ సెరీనా విలియ‌మ్స్ చ‌రిత్ర సృష్టించింది. గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీల్లో 308వ మ్యాచ్‌లో విజ‌యం సాధించి స‌రికొత్త ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. న్యూయార్క్‌లో జ‌రుగుతున్న యూఎస్ ఓపెన్ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో సెరీనా 6-2, 6-3 స్కోర్‌తో య‌రోస్లోవా ష్వెడోవాపై విజ‌యం సాధించి ఈ రికార్డును నెల‌కొల్పింది. దాంతో గ్రాండ్ టోర్నీల్లో అత్య‌ధికంగా మ్యాచ్‌లు గెలిచిన రోజ‌ర్ ఫెద‌ర‌ర్ రికార్డును సెరీనా బ్రేక్ చేసింది. జోరుమీదున్న వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ సెరీనా సెమీఫైన‌ల్లో రొమేనియా క్రీడాకారిణి సిమోనా హ‌లెప్‌తో పోటీప‌డ‌నుంది. ఒక‌వేళ ఈ టోర్నీ గెలిస్తే సెరీనా ఖాతాలో 23వ గ్రాండ్ స్లామ్ చేరుతుంది. యూఎస్ ఓపెన్‌ను కూడా రికార్డు స్థాయిలో ఏడ‌వ సారి సొంతం చేసుకున్నటవుతుంది.


1728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles