వీనస్‌పై నెగ్గిన సెరీనా విలియమ్స్

Sat,September 1, 2018 07:41 AM

Serena Williams beats sister Venus at US Open

న్యూయార్క్: టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ .. తన సోదరి వీనస్ విలియమ్స్‌ను ఓడించింది. యూఎస్ ఓపెన్ మూడవ రౌండ్ మ్యాచ్‌లో సెరీనా.. 6-1, 6-2 స్కోర్ తేడాతో ఈజీగా వీనస్‌పై విజయాన్ని సాధించింది. దీంతో సెరీనా నాలుగవ రౌండ్‌లోకి ప్రవేశించింది. 23 సార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్ అయిన సెరీనా.. 24 గ్రాండ్‌స్లామ్‌లు చేజిక్కించుకున్న మార్గరెట్ కోర్ట్ ఆల్ టైమ్ రికార్డును అందుకోవాలని చూస్తోంది. ఇవాళ జరిగిన మ్యాచ్ కేవలం 71 నిమిషాల్లోనే ముగిసింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అక్కాచెల్లెలు పోటీపడడం ఇది 30వ సారి. ఫస్ట్ సెట్‌లో మెడికల్ టైమౌట్ తీసుకున్న సెరీనా.. చాలా సునాయాసంగా ఆ సెట్‌ను సొంతం చేసుకున్నది. మొదటి రౌండ్‌లో వరల్డ్ నెంబర్ వన్ సైమోనా హలెప్‌ను ఓడించిన ఇస్టోనియాకు చెందిన కయా కనేపితో తర్వాత రౌండ్‌లో సెరీనా తలపడుతుంది.1542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles