పాండ్యా, రాహుల్‌లను వెనకేసుకొచ్చిన మాజీ కెప్టెన్!

Thu,January 17, 2019 04:28 PM

Saurav Ganguly defended Hardik Pandya and KL Rahul

కోల్‌కతా: కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లను వెనకేసుకొచ్చాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. తప్పులు జరగడం సహజమని, అలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలని దాదా అన్నాడు. ఈ కాలం క్రికెటర్లు పబ్లిగ్గా మాట్లాడే సమయంలో బాధ్యతగా ఉండాలా అని ప్రశ్నించగా.. గంగూలీ ఇలా స్పందించాడు. నేను ఆ ఎపిసోడ్ చూడలేదు. అయితే ఈ కాలం క్రికెటర్లు బాధ్యతాయుతంగా వ్యహరించాలంటూ అందరినీ కలిపి ఓ ప్రకటన చేయడం సరి కాదు. పొరపాట్లు అందరూ చేస్తారు. వాటిని పెద్దగా పట్టించుకోవద్దు. ఆ పొరపాటు చేసిన వాళ్లు తప్పు తెలుసుకొని మెరుగైన వ్యక్తిగా బయటకు వస్తారు. మనం మనుషులం. మెషీన్లం కాదు. వాళ్లు రోల్‌మోడల్సే కావచ్చు. కానీ బాగా ఆడాలన్న ఒత్తిడి వాళ్లపై ఉంటుంది. అందువల్ల ఇలాంటివి పెద్దగా పట్టించుకోకుండా ముందడుగు వేయడం మంచిది అని గంగూలీ చెప్పాడు.

పాత తరం క్రికెటర్లతో పోలిస్తే ఇప్పటి క్రికెటర్లు అంత బాధ్యతాయుతంగా ఉండటం లేదన్న విమర్శను కూడా గంగూలీ కొట్టి పారేశాడు. ఈ తరం క్రికెటర్లు కూడా బాధ్యతాయుతంగానే ఉన్నారని, కోహ్లినే చూస్తే అతనో రోల్ మోడల్ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు. గవాస్కర్, టెండూల్కర్, కోహ్లిలాంటి గొప్ప క్రికెటర్లు ఇండియా నుంచి రావడం అదృష్టమని అన్నాడు. మిడిల్ క్లాస్ కుటుంబాల నుంచి వచ్చిన వీళ్లంతా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని ఎదిగారని ప్రశంసించాడు. హిందీ మూవీ 22 యార్డ్స్ ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్న దాదా.. ఈ అంశంపై స్పందించాడు.

2331
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles