ఢిల్లీ టీమ్‌తో చేరిన గంగూలీ

Thu,March 14, 2019 03:02 PM

Saurav Ganguly appointed as Delhi Capital team Adviser

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. ఐపీఎల్ టీమ్ ఢిల్లీ కాపిటల్స్ టీమ్‌కు సలహాదారుగా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్ నుంచే అతను బాధ్యతలు చేపట్టనున్నాడు. ఢిల్లీ టీమ్ కోచ్ రిక్కీ పాంటింగ్‌తో కలిసి దాదా ఆ టీమ్‌కు సేవలు అందించనున్నాడు. ఢిల్లీ కాపిటల్స్ టీమ్‌తో చేరడం చాలా సంతోసంగా ఉందని ఈ సందర్భంగా గంగూలీ చెప్పాడు. జిందాల్స్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ల టీమ్‌లో భాగస్వామినవడం సంతోషంగా ఉంది. టీమ్‌లోని ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్‌తో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని దాదా అన్నాడు. అటు ఢిల్లీ టీమ్ కూడా గంగూలీని నియమించడం తమకు గర్వకారణమని చెప్పింది. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ ఈ స్థితిలో ఉందంటే దానికి గంగూలీనే కారణం. అతని దూకుడు, సానుకూల ధోరణి, వెన్ను చూపని మనస్తత్వం ఢిల్లీ కాపిటల్స్ టీమ్‌కు బాగా పనికొస్తుంది అని టీమ్ చైర్మన్ పార్థ్ జిందాల్ అన్నారు. ఢిల్లీ టీమ్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ సీజన్‌లో మార్చి 24న ముంబైతో తొలి మ్యాచ్ ఆడనుంది.


1329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles