కోచ్ ఎంపిక‌ను విరాట్‌కే వ‌దిలేయండి!

Thu,June 29, 2017 11:30 AM

ముంబై: అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లి మ‌ధ్య గొడ‌వ‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి. కుంబ్లే రాజీనామాపై.. కొత్త కోచ్‌గా ఎవ‌రు వ‌స్తార‌న్న‌దానిపై చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి. మాజీ క్రికెట‌ర్లు త‌మ ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటున్నారు. ఈ ఇష్యూలో కెప్టెన్ విరాట్ కోహ్లిని విమ‌ర్శించిన వాళ్లే ఎక్కువ‌. అయితే మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌ను చూస్తే.. కోచ్ ఎంపిక‌లో విరాట్ కోహ్లిని కూడా భాగం చేయాల‌ని మంజ్రేక‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. అదే స‌రైన ప‌ని అని అత‌ను స్ప‌ష్టంచేశాడు.


ర‌విశాస్త్రినే కోచ్ కావాల‌ని కోహ్లి భావిస్తున్నాడు. ఈ విష‌యాన్ని క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీకి కూడా అత‌ను స్ప‌ష్టంగా చెప్పాడు. అత‌ను కోరుకున్న‌ట్లే ర‌విశాస్త్రి కూడా కోచ్ ప‌ద‌వి కోసం ద‌రఖాస్తు చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అయితే అంద‌రిలాగే అత‌న్నీ ఇంట‌ర్వ్యూ చేస్తారా? లేక నేరుగా కోచ్‌ను చేస్తారా అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

3204
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles