ఐపీఎల్ వేలంలో ఆ ఇద్దరు కోట్లు కొల్లగొట్టారు..!

Tue,December 18, 2018 06:52 PM

Sam Curran goes to Kings XI Punjab for Rs 7.2 crore

ఐపీఎల్ వేలంలో ఇద్దరు విదేశీ క్రికెటర్లు కోట్లు కొల్లగొట్టారు. తొలిసారి ఐపీఎల్ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న శామ్ కుర్రన్‌పై కనకవర్షం కురిసింది. రూ.7.2కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. అత్యధిక ధర ప‌లికిన‌ విదేశీ క్రికెటర్‌గా నిలిచాడు. కొలిన్ ఇంగ్రామ్ కోసం హైదరాబాద్ పోటీపడినప్పటికీ ఢిల్లీ రూ.6.4 కోట్లకు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్స్ షాన్ మార్ష్, ఉస్మాన్ ఖవాజా కోసం ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.

అలాగే సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా, భారత క్రికెటర్ సౌరభ్ తివారీకి నిరాశ తప్పలేదు. లంక ఆట‌గాడుఏంజెలో మాథ్యూస్, కివీస్ ఆల్‌రౌండర్ కోరే ఆండర్సన్ అమ్ముడుపోలేదు. సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్‌ను బెంగ‌ళూరు రూ.50లక్షలకు చేజిక్కించుకుంది. పేసర్ బరిందర్ సరన్(కనీస ధర రూ.50లక్షలు)ను ముంబయి రూ.3.4కోట్లకు కొనుగోలు చేసింది. ఇండియన్ సీనియర్ ఫాస్ట్‌బౌలర్ వినయ్‌కుమార్‌పై ఎవరూ ఆసక్తి ప్రదర్శించలేదు. కివీస్ ఫాస్ట్ బౌలర్ లూకీ ఫర్గూసన్‌ను కోల్‌కతా రూ.1.6కోట్లకు దక్కించుకుంది. సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్‌స్టెయిన్‌కు నిరాశ తప్పలేదు.

6410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles