అవును.. ఆ రోజే కశ్యప్‌ను పెళ్లి చేసుకుంటున్నా!

Mon,October 8, 2018 12:44 PM

Saina Nehwal confirms marriage date with Parupalli Kashyap

హైదరాబాద్: హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు కొద్ది రోజులుగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే తొలిసారి తమ రిలేషన్‌షిప్‌పై సైనా నెహ్వాల్ నోరు విప్పింది. ఏకంగా పెళ్లి తేదీని కూడా ఆమె ప్రకటించేయడం విశేషం. డిసెంబర్ 16న తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె స్పష్టంచేసింది. ఆ తేదీ వెనుక కారణాన్ని కూడా సైనా వివరించింది. ఇక తమ మధ్య ప్రేమ ఎలా చిగురించిందో కూడా సైనా చెప్పింది. 2007 నుంచి మేం ఇద్దరం టోర్నీల కోసం కలిగి ప్రయాణిస్తున్నాం. కలిసి ఆడాము, కలిసి శిక్షణ తీసుకున్నాం.. అలా మెల్లగా మా ఇద్దరి మధ్య ఆకర్షణ మొదలైంది అని సైనా చెప్పింది. టోర్నీలతో చాలా బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ మాట్లాడుకోవడానికి, సన్నిహితంగా మెలిగే అవకాశం తమకు దక్కిందని ఆమె తెలిపింది. అయితే పెళ్లి ఆలోచన మాత్రం తమకు ఎప్పుడూ రాలేదని కూడా సైనా వివరించింది. ఇప్పుడు కాస్త ఖాళీ సమయం దొరకడంతో ఇక పెళ్లితో ఒక్కటవ్వాలని నిర్ణయించినట్లు ఆమె చెప్పింది.

మేం గతంలో ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించలేదు. మేము ఎంచుకున్న కెరీర్లు అలాంటివి. టోర్నీలు గెలవడం చాలా ముఖ్యం. అందుకే మా దృష్టి మరలకుండా జాగ్రత్తపడ్డాం. చిన్న పిల్లలకు ఎంత కేర్ అవసరమో ప్లేయర్స్‌కు కూడా అంతే అవసరం. ఇన్నాళ్లూ మా ఇంట్లో వాళ్లే అవన్నీ చూసుకున్నారు. పెళ్లి తర్వాత అది మారుతుంది. నాపై బాధ్యత పెరుగుతుంది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ పూర్తయ్యే వరకు పెళ్లి ప్రస్తావన వద్దని అనుకున్నాం. ఇప్పుడు ఆ దానికి సమయం వచ్చింది అని సైనా వివరించింది. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా రాలేదని, వాళ్లే అర్థం చేసుకున్నారని కూడా ఆమె చెప్పడం విశేషం. డిసెంబర్ 16నే ఎందుకు పెళ్లి అని అడిగితే.. డిసెంబర్ 20 తర్వాత మళ్లీ ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌తో బిజీ అవుతాను. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఉంటాయి. అందుకే ఆ లోపే పెళ్లి తంతు పూర్తి చేద్దామని అనుకున్నాం అని సైనా చెప్పింది.

4591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles