ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే భారత్, పాక్ మ్యాచ్ పెద్దది: సైఫ్

Sun,June 16, 2019 07:04 PM

saif ali khan comments on india vs pakistan match

క్రికెట్ ఆటలో ఎన్నో టోర్నీలు వస్తాయి.. ఎన్నో ఆటలు ఆడుతారు. రకరకాల ప్రపంచ కప్‌లు రావచ్చు. ఎన్నో జట్లు తలపడొచ్చు. కానీ.. భారత్, పాక్ మధ్య జరిగే మ్యాచే ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే పెద్దది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ అనేది అద్భుతమైన కంటెస్ట్.. అని బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ అన్నారు. ఆయన భారత్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను వీక్షించేందుకు మాంచెస్టర్ వచ్చారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత్, పాక్ మ్యాచ్ గురించి పై వ్యాఖ్యలు చేశారు.

ఇక.. ప్రస్తుతం మ్యాచ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. మాంచెస్టర్‌లో అకస్మాత్తుగా వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. 46.4 ఓవర్‌లో వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇండియా 46.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది.7691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles