సచిన్ వల్లే హర్భజన్‌కు శిక్ష!Sun,January 21, 2018 01:49 PM
సచిన్ వల్లే హర్భజన్‌కు శిక్ష!

సిడ్నీః సరిగ్గా పదేళ్ల కిందట ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ టెస్ట్ ఎంత వివాదమైందో తెలిసిందే కదా. ఆసీస్ ఆల్‌రౌండర్ సైమండ్స్‌ను భజ్జీ మంకీ అన్నాడంటూ అతనిపై జాతి వివక్ష ఆరోపణలు చేసి మూడు మ్యాచ్‌లు నిషేధం విధించారు. అయితే ఆ సమయంలో సచిన్ ఒక్క మాట చెప్పి ఉంటే ఆ విచారణ మొత్తం మరోలా ఉండేదని ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన మైక్ ప్రోక్టర్ అన్నాడు. తాజాగా తన ఆటో బయోగ్రఫీ కాట్ ఇన్ ద మిడిల్‌లో ఆ ఘటనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అసలు సచిన్ తీరు తనను అసంతృప్తికి గురి చేసినట్లు అతడు చెప్పాడు. అసలు హర్భజన్.. సైమండ్స్‌ను మంకీ అని అనలేదు.. మాకీ అన్నాడు అని సచిన్ ముందే చెప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అప్పుడు హర్భజన్‌పై జాతి వివక్ష ఆరోపణలు ఉండేవి కావు. కానీ సచిన్ అలా చెప్పకపోవడం అసంతృప్తికి గురి చేసింది అని ప్రోక్టర్ ఆ బుక్‌లో వివరించాడు.

ఇక మంకీ, మాకీ అనే పదాలు దూరం నుంచి విన్నపుడు ఒకేలా అనిపిస్తాయని, అదే విషయం తమ ప్రాథమిక విచారణలోనే సచిన్ చెప్పి ఉంటే వేరుగా ఉండేదని ప్రోక్టర్ అన్నాడు. కానీ సచిన్ అలా చెప్పకపోవడంతో తనకు వేరే దారి లేకపోయిందని చెప్పాడు. ఇక అప్పటి ఇండియన్ టీమ్ మేనేజర్ చేతన్ చౌహాన్ కూడా ఈ ఘటనపై బలంగా వాదన వినిపించలేకపోయాడని ప్రోక్టర్ ఆ బుక్‌లో వెల్లడించాడు. ఇండియన్స్‌గా తాము జాతి వివక్ష వ్యాఖ్యలు చేసే అవకాశమే లేదని చౌహాన్ పాంటింగ్‌తో చెప్పాడు. కానీ ఈ వాదనతో ఆస్ట్రేలియా ఇచ్చిన ఫిర్యాదును తోసిపుచ్చడం ఎలా కుదురుతుంది అని ప్రోక్టర్ అన్నాడు.

8071
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018