బ్రబౌర్న్‌ స్టేడియం గంట కొట్టిన‌ సచిన్‌: వీడియో

Mon,October 29, 2018 01:50 PM

Sachin Tendulkar rings the bell

ముంబయి: టీమ్‌ఇండియా, వెస్టిండీస్ మధ్య నాలుగో వన్డే ఆరంభానికి ముందు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆరంభ గంట(రింగ్‌ బెల్‌)ను కొట్టారు. చాలా ఏళ్ల తర్వాత బ్రబౌర్న్ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్(2006) తర్వాత బ్రబౌర్న్ మైదానంలో జరుగుతున్న తొలి వన్డే ఇదే కావడం విశేషం. గ‌త కొన్నేళ్ల నుంచి విదేశాల నుంచి వచ్చే పర్యాటక జట్లకు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల కోసం ఈ స్టేడియాన్ని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెటర్ సచిన్ గంట మోగించి మ్యాచ్‌ను ప్రారంభించారు. మ్యాచ్‌కు ముందు ఆరంభ గంటను కొట్టే సంప్రదాయం ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌ క్రికెట్‌ మైదానంలో ప్రారంభ‌మైంది. భారత్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లోనూ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి.



1872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS