నా మద్దతు ఇంగ్లాండ్‌కే.. కమాన్ ఇంగ్లాండ్: సచిన్ వీడియో

Wed,July 11, 2018 04:46 PM

Sachin Tendulkar reveals his pick to win World Cup in Russia

ముంబయి: లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టుకు మద్దతుగా నిలిచారు. అయితే అది క్రికెట్ వరల్డ్‌కప్‌లో కాదు. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో.. రెండో సెమీ ఫైనల్లో భాగంగా బుధవారం రాత్రి ఇంగ్లాండ్, క్రోయేషియా జట్లు తలపడనున్నాయి. 52ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఇంగ్లీష్ టీమ్ ఆశిస్తోంది. టైటిల్ ఫేవరెట్‌గా ఇంగ్లాండ్ టోర్నీలో బరిలో దిగి అద్భుత ప్రదర్శనతో సెమీస్ చేరింది. ఈ నేపథ్యంలో ఫిఫా సమరంలో నా మద్దతు ఇంగ్లాండ్ జట్టుకేనని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ముందుగా క్రికెట్ బంతిని చేతితో గాల్లోకి ఎగిరేస్తూ .. గయ్స్, ఈసారి నా మద్దతు ఇంగ్లాండ్‌కే అని చెప్పారు. ఆ తరువాత వెంటనే క్లారిటీ ఇచ్చారు. ఫుట్‌బాల్‌లో.. నేను ఇంగ్లాండ్‌కు సపోర్ట్ చేస్తున్నాను. ఫుట్‌బాల్‌ను తన కాలుతో కెమెరా వైపు తన్ని.. కమాన్ ఇంగ్లాండ్ అని సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకున్నారు.

విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుపై భారత్ 2-1తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. జులై 12న ఇరుజట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ ఆరంభంకానుంది.

Come on England!! #FIFA18 @jamo1dj

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on

2403
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles