కోహ్లి, సచిన్.. ఒకే రికార్డు, ఒకే స్కోరు, ఒకే టీమ్‌పై..!

Tue,August 21, 2018 12:37 PM

Sachin and Virat Kohli scored their 58th century on same opponents

నాటింగ్‌హామ్: క్రికెట్‌లో రికార్డులు ఉన్నవి తిరగరాయడానికే. అలా ఇప్పటికే ఎన్నో రికార్డులు మరుగున పడిపోయాయి. క్రికెట్ గాడ్‌గా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ గతంలో ఉన్న అన్ని రికార్డులను చెరిపేశాడు. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. మాస్టర్ రికార్డులను వేటాడుతున్నాడు. ముఖ్యంగా సెంచరీలు, పరుగుల విషయంలో ఏదో ఒక రోజు మాస్టర్ బ్లాస్టర్ రికార్డులను కోహ్లి బీట్ చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. తాజాగా ఇంగ్లండ్ టీమ్‌పై కోహ్లి సెంచరీ చేసిన సంగతి తెలుసు కదా. ఇదేమీ సచిన్ రికార్డును బీట్ చేయలేదుగానీ.. ఈ సెంచరీకి సచిన్ 17 ఏళ్ల కిందట సాధించిన సెంచరీకి దగ్గరి పోలికలు ఉన్నాయి. ఇది కోహ్లి అంతర్జాతీయ కెరీర్‌లో 58వ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లి 103 పరుగులు చేశాడు. అయితే సరిగ్గా 17 ఏళ్ల కిందట సచిన్ కూడా ఇదే ఇంగ్లండ్ టీమ్‌పై తన కెరీర్‌లో 58వ సెంచరీ చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో మాస్టర్ కూడా సరిగ్గా 103 పరుగులే చేయడం విశేషం. అంతేకాదు ఈ స్కోరు చేయ‌డానికి ఇద్ద‌రూ ఎదుర్కొన్న బంతులు కూడా 197 కావ‌డం మ‌రో విశేషం. అప్పుడు సచిన్ వయసు 28 ఏళ్లు కాగా.. ఇప్పుడు కోహ్లి వయసు 29.

3524
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles