Telangana Intermediate 1st & 2nd Year Results 2019

ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. సౌదీని చిత్తు చేసిన ర‌ష్యా- వీడియో

Fri,June 15, 2018 10:08 AM

Russia wins first match in football world cup

మాస్కో: సాకర్ ప్రపంచకప్ ఆరంభమ్యాచ్ అదిరింది..ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానులకు ఫుట్‌బాల్ మజాను అందిస్తూ 2018 ఫిఫా కప్‌లో రష్యా ఘనవిజయంతో జిగేల్‌మంది.. అద్భుతమైన అటాకింగ్.. చెలరేగిన మిడ్‌ఫీల్డర్లు.. ఆకట్టుకున్న స్ట్రైక‌ర్లు .. గోడలా మారిన డిఫెండర్లు..దీంతో తొలిమ్యాచ్‌లో సౌదీ అరేబియాకు ఘోర పరాభవం.. ఎన్నో ఆశలతో ప్రపంచకప్‌లో అడుగిడిన రష్యా అభిమానులకు సంతోషం పంచగా.. భారీ తేడాతో ఓడిన సౌదీకి షాక్ తగిలింది. ఫ‌స్ట్ మ్యాచ్‌లో ర‌ష్యా 5-0 తేడాతో సౌదీ అరేబియాపై సూప‌ర్ విక్ట‌రీ సాధించింది.



చెర్షేవ్ డబుల్..
ఆట ప్రారంభం నుంచే రష్యా దాడులతో సౌదీ అరేబియా డిఫెన్స్ చెల్లాచెదురైంది. తొలి నిమిషాల్లోనే రష్యా సూపర్ స్ట్రైక‌ర్లు అలెగ్జాండర్ సమెదోవ్, ఫెడోర్ స్మోలోవ్ సౌదీని హడలెత్తించారు. ఈ దాడులకు వెంటనే ఫలితం కనిపించింది. ఆట 12 వ నిమిషంలో గాజిన్‌స్కీ తొలిగోల్‌తో రష్యా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ గోల్‌తో 2018 ప్రపంచకప్‌లో తొలిగొల్ కొట్టిన ఫుట్‌బాలర్‌గా రికార్డు నెలకొల్పాడు.

ఆట ప్రథమార్థం ముగిసే వరకు అంతా సాధారణంగానే సాగినా రష్యా ఆటలో దూకుడుమాత్రం కొనసాగింది. తొలి అర్థభాగం ముగిసే సమయంలో చెర్షేవ్ మాయ చేశాడు. 43వ నిమిషంలో గోల్‌తో ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. ఆట రెండో అర్ధభాగంలో రష్యా ఆటగాళ్లు మరింత వేగంగా దూకుడుగా ఆడారు. ఆట 71వ నిమిషంలో జియుబా గోల్ కొట్టడంతో 3-0తో మరింత ఆధిక్యం దక్కగా.. ఇంజ్యూరీ సమయం 91వ నిమిషంలో చెర్షేవ్ రెండోగోల్‌తో హోరెత్తించగా మరో నిమిషంలో ఆట ముగుస్తుందనగా లభించిన పెనాల్టీస్ట్రోక్‌ను గొలోవిన్ గోల్‌గా మలుచడంతో రష్యా 5-0తో భారీ విజయం సాధించింది.

987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles