ఐపీఎల్.. చెన్నై ల‌క్ష్యం 206..

Wed,April 25, 2018 09:49 PM

royal challengers bangalore put a target of 206 runs for chennai

బెంగళూరు: ఐపీఎల్ 2018 టోర్నమెంట్‌లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జ‌రుగుతున్న టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొద‌ట‌గా బ్యాటింగ్ చేసిన రాయల్స్ చాలెంజర్స్ బెంగుళూరు 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. డివిలియ‌ర్స్ 68 ప‌రుగులు (30 బంతులు, 2 ఫోర్లు, 8 సిక్స‌ర్లు), క్వింట‌న్ డికాక్ 53 ప‌రుగులు (37 బంతులు, 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు) చేయ‌డంతో బెంగుళూరు భారీ స్కోర్ చేసింది. మ‌రోవైపు చివ‌ర్లో మ‌న్‌దీప్ సింగ్ దూకుడుగా ఆడి 32 ప‌రుగులు (17 బంతులు, 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు) చేయ‌డంతో ఆ జ‌ట్టు చెన్నై ఎదుట 206 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచ‌గ‌లిగింది. కాగా చెన్నై బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్‌, తాహిర్కు, బ్రేవోకు త‌లా 2 వికెట్లు ద‌క్కాయి.

2037
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles