ఐపీఎల్.. పంజాబ్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు

Mon,May 14, 2018 07:43 PM

Royal Challengers Bangalore have won the toss and have opted to field

ఇండోర్: ఐపీఎల్ 2018 టోర్నమెంట్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టుతోనే రాయల్ చాలెంజర్స్ ఈ మ్యాచ్ ఆడుతుండగా అటు పంజాబ్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. ముజీబ్‌కు బదులుగా మార్కస్ స్టోయినిస్ జట్టులోకి వచ్చాడు.

జట్ల వివరాలు...


కింగ్స్ ఎలెవన్ పంజాబ్: లోకేష్ రాహుల్ (వికెట్ కీపర్), క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, ఆరోన్ ఫించ్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ (కెప్టెన్), ఆండ్రూ టై, బరిందర్ శ్రాన్, మోహిత్ శర్మ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: పార్థివ్ పటేల్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, విరాట్ కోహ్లి (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, మన్‌దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, యజ్‌వేంద్ర చాహల్

2059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles