ఒక్కడు నిలిచాడు.. ఛేజ్ 98 నాటౌట్

Fri,October 12, 2018 04:59 PM

Roston Chase, Jason Holder inspire West Indies amid Umesh Yadavs strikes

హైదరాబాద్: వెస్టిండీస్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శుక్రవారం ఆటలో 95 ఓవర్లు ఆడిన కరీబియన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. 59.3 ఓవర్లకు విండీస్ స్కోరు 182/6. తొలి రెండు సెషన్లలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన పర్యాటక జట్టు కనీసం 200 పరుగులైనా దాటుతుందా లేదా అనే సందేహం కలిగింది. అవసరమైన సమయంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రోస్టన్ ఛేజ్(98 నాటౌట్: 174 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్) ఆపద్భాందవుడిలా ఆదుకోవడంతో టీమ్ 300 పరుగుల మార్క్‌ను చేరుకుంది. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచాడు. టాప్ ఆర్డర్ కన్నా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మెరుగైన ప్రదర్శన చేశారు. భారత బౌలర్లు వికెట్లు తీస్తున్నా తమదైన శైలిలో పరుగులు సాధించి స్కోరు బోర్డును ముందుండి నడిపించారు. కెప్టెన్ జాసన్ హోల్డర్(52) అర్ధశతకంతో రాణించాడు.

తొలి రెండు సెషన్లలో ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్‌ఇండియా ఆఖరి సెషన్లో టెయిలెండర్లను పెవిలియన్ పంపలేకపోయింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు. టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన శార్దుల్ ఠాకూర్ తన రెండో ఓవర్‌లోనే మైదానాన్ని వీడాడు. బౌలింగ్ వేసిన తర్వాత కాలి గాయంతో అతడు ఇబ్బందిపడ్డాడు. ఫిజియో సూచన మేరకు తొలి రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు.

3924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles