గుల్బ‌దిన్ బ్రిలియంట్ క్యాచ్‌.. బెయిర్‌స్టో 90 ఔట్

Tue,June 18, 2019 05:16 PM

Root,   Morgan Look to Build Partnership

మాంచెస్టర్: ఇంగ్లాండ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(90: 99 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్స‌ర్లు) సెంచరీకి దగ్గర్లో పెవిలియన్ చేరాడు. హాఫ్‌సెంచరీ తర్వాత మెరుపులు మెరిపించిన బెయిర్‌స్టో గుల్బదిన్ నైబ్ వేసిన 30వ ఓవర్లో అత‌నికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రూట్‌తో కలిసి బెయిర్‌స్టో మంచి ఇన్నింగ్స్ నిర్మించాడు. ఆచితూచి ఆడుతున్న జో రూట్ అర్ధశతకంతో అలరించాడు. 54 బంతుల్లో కేవలం 2 ఫోర్లు మాత్రమే బాది ఈ 50 మార్క్ అందుకున్నాడు. రూట్ ఎక్కువగా సింగిల్స్ తీయగానికే ప్రయత్నిస్తున్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌లో అతనికిది ఐదోవది కాగా.. వన్డేల్లో 32వ హాఫ్‌సెంచరీ కావడం విశేషం. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇయాన్ మోర్గాన్.. నైబ్ బౌలింగ్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చాడు. అఫ్గన్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తోంది. 34 ఓవర్లు ముగిసేసరికి ఆతిథ్య జట్టు రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రూట్(51), మోర్గాన్(25) క్రీజులో ఉన్నారు.

1747
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles