సిడ్నీ వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ

Sat,January 12, 2019 03:13 PM

Rohit Slams 22nd Ton

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ(100 నాటౌట్, 110 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. 4/3తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆదుకున్నాడు. ఆరంభం నుంచి సంయమనంతో వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆసీస్ పేసర్లను ధాటిగా ఎదుర్కొంటూ హిట్‌మ్యాన్ పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే వన్డే కెరీర్‌లో 22వ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం జడేజా(3), రోహిత్(103) క్రీజులో ఉన్నారు. 41 ఓవర్లు ముగిసేవరకు భారత్ 5 వికెట్లకు 184 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 54 బంతుల్లో 105 పరుగులు చేయాలి.

ఆసీస్ గడ్డపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు(Ind-Aus) చేసింది వీళ్లే..!
సచిన్ టెండూల్కర్-9
రోహిత్ శర్మ-7
రికీ పాంటింగ్ -6
విరాట్ కోహ్లీ-5

3516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles