రోహిత్ శర్మ 10 ఇయర్ చాలెంజ్ మెసేజ్ చూశారా?

Fri,January 18, 2019 12:39 PM

Rohit Sharmas 10 year challenge is a strong message to the world

మెల్‌బోర్న్: 10 ఇయర్ చాలెంజ్.. తాజాగా సోషల్ మీడియాను ఊపేస్తున్న కొత్త చాలెంజ్ ఇది. సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత మరొకరు ఈ చాలెంజ్‌కు సై అంటున్నారు. ఈ చాలెంజ్ అంటే ఏమీ లేదు.. పదేళ్ల కిందట ఎలా ఉండేవాళ్లు.. ఇప్పుడెలా ఉన్నారు.. ఈ రెండు ఫొటోలూ సోషల్ మీడియాలో షేర్ చేస్తే చాలు. ఇప్పటికే ఐసీసీ సహా ఎంతో మంది క్రికెటర్లు కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. అయితే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 10 ఇయర్ చాలెంజ్ మాత్రం వాళ్లకు భిన్నంగా, ఆలోచింపజేసేదిగా ఉంది. అందరూ తమ ఫొటోలను షేర్ చేస్తే.. రోహిత్ మాత్రం దెబ్బ తింటున్న పర్యావరణాన్ని హైలైట్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. పదేళ్ల కిందట సముద్రంలోని కోరల్ రీఫ్ ఎలా ఉంది.. ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందో ఒక్క ఫొటోతో వివరించే ప్రయత్నం అతను చేశాడు. ఇంతకు మించి ఆందోళన కలిగించే 10 ఇయర్ చాలెంజ్ ఏముంటుంది అంటూ రోహిత్ ట్వీట్ చేయడం విశేషం.


2522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles