
సిడ్నీ: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అద్భుత శతకం సాధించినప్పటికీ భారత్ గెలుపొందని విషయం తెలిసిందే. ఐతే మ్యాచ్ అనంతరం హోటల్లో భారత ఆటగాళ్లు ఒత్తిడిని జయించేందుకు సరదాగా గడిపారు. మైదానంలో 45 ఓవర్లు బ్యాటింగ్ చేసిన రోహిత్ కొత్త స్టెప్పులు నేర్చుకున్నాడు. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ కూతురు రియా.. హిట్‌మ్యాన్‌కు డ్యాన్స్ నేర్పించింది. ఫ్లాస్ డ్యాన్స్ ఎలా చేయాలో రోహిత్‌తో పాటు కేదార్ జాదవ్‌కు రియా చేసి చూపించింది.పక్కనే ధావన్ భార్య, కొడుకు వీళ్లను ఆసక్తిగా గమనించారు. ఫ్లాస్ డ్యాన్స్ మూమెంట్ ఎలా చేయాలో రోహిత్‌కు రియా నేర్పిస్తున్న వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఐతే రియా లాగా డ్యాన్స్ చేయడంలో రోహిత్ తడబడ్డాడు. హిట్‌మ్యాన్ డ్యాన్స్ ఎలా నేర్చుకుంటున్నాడో చూడండి అని వ్యాఖ్యానించింది.