రోహిత్ బ్రిలియంట్ సెంచరీ..పాక్‌పై వరుసగా రెండోది

Sun,June 16, 2019 05:11 PM

Rohit Sharma slams century as India look strong

మాంచెస్టర్: వన్డే ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ శతకంతో కదంతొక్కాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ కళ్లుచెదిరే షాట్లతో అలరించాడు. భారత్‌కు మంచి శుభారంభం అందించిన రోహిత్ 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షాదాబ్ ఖాన్ వేసిన 30వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి 100 మార్క్ చేరుకున్నాడు. పాక్‌తో వరుసగా రెండో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో రెండోది కాగా వన్డేల్లో 24వ శతకం కావడం విశేషం. చివరిసారిగా 2018 ఆసియా కప్‌లో 111 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. క్లాస్ బ్యాటింగ్‌తో రోహిత్ భారీ ఇన్నింగ్స్ వైపు దూసుకెళ్తున్నాడు. షార్ట్‌పిచ్ బంతులతో రోహిత్‌ను బోల్తా కొట్టించాలని పాక్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాడు. బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన పాక్‌పై స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 32 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. రోహిత్(104), కోహ్లీ(20) క్రీజులో ఉన్నారు.

1849
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles