చేజింగ్‌లో భార‌త్ రికార్డు ఇది.. రోహిత్ ఔట్‌

Wed,July 10, 2019 03:42 PM

Rohit Sharma out against New Zealand at Manchester Semifinal

హైద‌రాబాద్ : మాంచెస్ట‌ర్ సెమీస్‌లో భార‌త్ టార్గెట్ 240. అయితే పిచ్ స్పీడ్ బౌల‌ర్ల‌కు అనుకూలిస్తున్న‌ది. మ‌రి మ‌నోళ్లు ఆ టార్గెట్‌ను అందుకుంటారా లేదా అన్న సందేహాం అంద‌రిలో ఉన్న‌ది. కానీ టీమిండియా రికార్డులు ప‌రిశీలిస్తే మాత్రం.. ఆ టార్గెట్ పెద్ద లెక్కేమీ కాద‌ని తెలుస్తోంది. గ‌త మూడేళ్ల‌లో భార‌త్ 15 వ‌న్డేల్లో సుమారు 220 నుంచి 270 ర‌న్స్ మ‌ధ్య టార్గెట్‌ను చేజింగ్ చేసింది. ఆ మ్యాచుల్లో భార‌త్ 14 వ‌న్డేల‌ను గెలుచుకున్న‌ది. ఓ మ్యాచ్ మాత్రం టై అయ్యింది. 220 నుంచి 270 ప‌రుగుల‌ టార్గెట్ ఉన్న మ్యాచ్‌ను గ‌త మూడేళ్ల‌లో ఇండియా కోల్పోలేదు. చేజింగ్ స్టార్ట్ చేసిన ఇండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. అయిదు సెంచ‌రీల‌తో వ‌రల్డ్‌క‌ప్‌లో ఊపుమీదున్న రోహిత్‌.. ఇవాళ ఒక ప‌రుగు మాత్ర‌మే చేసి నిష్క్ర‌మించాడు. భార‌త అభిమానుల్లో అప్పుడే ఉత్కంఠ మొద‌లైంది.

1736
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles