జడేజాను రోహిత్ కొడదామనుకున్నాడట.. ఎందుకో తెలుసా?

Wed,June 6, 2018 01:10 PM

Rohit Sharma once wanted to punch Ravindra Jadeja here is why

ముంబై: రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా.. ఈ ఇద్దరూ టీమిండియా క్రికెటర్లే. ఒకరు కామ్‌గా తన పని తాను చేసుకుపోయే రకమైతే.. మరొకరు కోతి చేష్టలు చేస్తూ ఎంజాయ్ చేసే రకం. ఎంతో కామ్‌గా ఉండే రోహిత్‌శర్మకు కూడా కోపం తెప్పించాడు జడేజా. ఎంతలా అంటే.. జడేజాను కొడదామన్నంత కోపం రోహిత్‌కు వచ్చిందట. దీని వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీని వాట్ ద డక్ అనే ప్రోగ్రామ్‌లో రోహిత్ చెప్పాడు.

రహానేతో కలిసి ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న రోహిత్.. సౌతాఫ్రికాలో జరిగిన ఆ ఘటన గురించి వివరించాడు. ఈ ఏడాది మొదట్లో సౌతాఫ్రికాలో లాంగ్ టూర్ కోసం టీమిండియా వెళ్లిన విషయం తెలిసిందే కదా. ఆ టూర్‌లో భాగంగా కొందరు క్రికెటర్లు కలిసి సఫారీకి వెళ్లారు. ఆ రోజు జడేజా చేసిన పని రోహిత్‌కు కోపం తెప్పించింది. సఫారీకి సంబంధించి నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేశాం. అయితే ఒక ఘటన మాత్రం ఇప్పటికీ భయపెడుతున్నది. అక్కడ ఓ చిరుత పులి నడుస్తున్నది. దాని వెనుక మరో రెండు, మూడు పులులు ఉన్నాయి. అడవిలో ఉండటంతో మా చుట్టూ ఇంకేం ఉన్నాయో కూడా తెలియదు. అక్కడికి వెళ్లిన తర్వాత నేను, రాధిక (రాహానే భార్య), రితిక (రోహిత్ భార్య), రోహిత్, జడేజా వాటి వెనుకాల నడుస్తున్నాం.

సడెన్‌గా రెండు చీతాలు మావైపు చూశాయి అని రహానే చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో రోహిత్ అందుకొని.. జడేజా వల్లే ఆ చీతాలు మావైపు చూశాయి. వాటి వెనుకాల వెళ్తూ జడేజా చిత్రమైన సౌండ్స్ చేయడం ప్రారంభించాడు. ఎందుకలా చేస్తున్నావ్.. మనం అడవిలో ఉన్నాం. చీతాలు మనల్ని చూస్తే మన పని అయిపోయినట్లే అని చెప్పినా జడేజా వినలేదు. ఆ సమయంలో అతన్ని కొట్టాలనిపించింది. జడేజావైపు కోపంగా చూశాను. కానీ నన్ను నేను నిగ్రహించుకొని కొట్టకుండా ఉన్నాను అని రోహిత్ చెప్పాడు.

3264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS