రోహిత్‌శర్మ ఖాతాలో చెత్త రికార్డు

Thu,February 22, 2018 03:28 PM

Rohit Sharma gets unwanted record to his name

సెంచూరియన్‌ః టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. తొలి టీ20లో క్రీజులోకి రాగానే బౌలర్లను ఊచకోత కోసిన రోహిత్ శర్మ.. రెండో టీ20లో మాత్రం ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో డాలా వేసిన తొలి బంతికే రోహిత్ ఔటయ్యాడు. బంతి బౌన్స్‌ను సరిగా అంచనా వేయలేకపోయిన రోహిత్.. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రోహిత్‌శర్మ గోల్డెన్ డకౌట్ అవడం టీ20ల్లో ఇది నాలుగోసారి. టీ20 కెరీర్‌లో ఇన్నిసార్లు గోల్డెన్ డక్ అయిన తొలి ఇండియన్ క్రికెటర్ రోహిత్‌శర్మే కావడం విశేషం. అతని కంటే ముందు టీమిండియా బౌలర్ ఆశిష్ నెహ్రా, ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ మూడేసిసార్లు గోల్డెన్ డకౌటయ్యారు. అంతకుముందు ఇదే మ్యాచ్‌లో ధావన్ కూడా తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అంపైర్ ఔట్‌గా ప్రకటించినా.. రీవ్యూ కోరాడు ధావన్. అయితే రీప్లేల్లో ఇన్‌సైడ్ ఎడ్జ్ అని తేలడంతో ధావన్ గోల్డెన్ డకౌట్ నుంచి బయటపడ్డాడు.

2384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles