శ‌త‌క వీరుడు రోహిత్‌ ఔట్‌

Sun,June 16, 2019 05:50 PM

Rohit Sharma falls after superb century

మాంచెస్టర్: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. హసన్ బౌలింగ్‌లో జట్టు స్కోరు 234 వద్ద శతక వీరుడు రోహిత్ శర్మ(140: 113 బంతుల్లో 14ఫోర్లు, 3సిక్సర్లు) స్కూప్ షాట్ ఆడగా బంతి నేరుగా ఫైన్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రియాజ్ చేతిలో పడింది. దీంతో రోహిత్ నిరాశగా మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం టీమిండియా పటిస్ఠస్థితిలో ఉండగా.. పాక్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. 41 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య(9), విరాట్ కోహ్లీ(41) క్రీజులో ఉన్నారు.2484
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles