టెన్నిస్ మ్యాచ్ చూసిన రోహిత్, కార్తీక్

Wed,January 16, 2019 06:33 PM

Rohit Sharma and Dinesh Karthik watched Rafael Nadal Match at Australian Open

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు ముందు ఒక రోజు ఖాళీ సమయం దొరకడంతో టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్, విజయ్ శంకర్ టెన్నిస్ మ్యాచ్ చూశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భాగంగా మాజీ వరల్డ్ నంబర్ వన్ రఫెల్ నడాల్ మ్యాచ్ బుధవారం జరిగింది. ఈ మ్యాచ్‌కు ఈ ముగ్గురు క్రికెటర్లు వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోను రోహిత్ ట్వీట్ చేశాడు. లోకల్ బాయ్ మాథ్యూ ఎబ్డెన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో నడాల్ 6-3, 6-2, 6-2తో గెలిచాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో రోహిత్ ఇప్పటికే ఓ సెంచరీ చేయగా.. రెండో మ్యాచ్‌లోనూ రాణించాడు. అటు కార్తీక్ కూడా రెండో వన్డే విజయంలో కీలకపాత్ర పోషించాడు.


3454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles