రోహిత్ మెరుపు హాఫ్‌సెంచ‌రీ

Sun,June 16, 2019 03:54 PM

Rohit, Rahul get India off to brisk start

మాంచెస్టర్: పాకిస్థాన్‌తో పోరులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుండటంతో ఆచితూచి ఆడుతున్నారు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్.. హిట్‌మ్యాన్‌కు సహకారం అందిస్తూ నిదానంగా ఆడుతున్నాడు. రోహిత్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తుండగా.. రాహల్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తొలి 8 ఓవర్లు ఫాస్ట్‌బౌలర్లతో బౌలింగ్ వేయించిన సర్ఫరాజ్ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. 10వ ఓవర్‌లో రోహిత్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రియాజ్ వేసిన తొలి బంతిని రాహుల్ మిడ్‌వికెట్ దిశగా షాట్ ఆడాడు. ఐతే తొలి పరుగు పూర్తి చేసిన తర్వాత రోహిత్ రెండో పరుగు తీసేందుకు సగం పిచ్ వరకు వెళ్లాడు. బౌలింగ్ ఎండ్‌లో ఉన్న రాహుల్ పరుగు తీసేందుకు నిరాకరించడంతో రోహిత్ వెనక్కి వెళ్లాడు. బంతిని అందుకున్న ఫకార్ జమాన్ బౌలింగ్ ఎండ్‌వైపు త్రో వేశాడు. దీంతో రోహిత్ మళ్లీ కీపింగ్ ఎండ్‌వైపు పరుగుతీశాడు. షాదాబ్ ఖాన్ వేసిన 12వ ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన రోహిత్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా భారత్ 79 పరుగులు చేసింది. రోహిత్(50), రాహుల్(27) క్రీజులో ఉన్నారు.

2228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles