కోహ్లీసేనకు మేం మద్దతుగా నిలిచాం.. మరి మీరూ!

Sat,August 11, 2018 12:46 PM

Rohit gets nod from Bachchan for backing Kohli team

లండన్: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత బ్యాట్స్‌మెన్ మరోసారి తమ వైఫల్యాన్ని కొనసాగించారు. తొలి టెస్టులో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని రెండో టెస్టులో ఇంగ్లీష్ జట్టుకు గట్టి పోటీనిస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ భారత్ పతనాన్ని శాసించాడు. స్వింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆతిథ్య బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో స్వల్ప స్కోరుకే కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్ ముగించింది. రెండో రోజు ఆటలో భారత తొలి ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలిన సంగ‌తి తెలిసిందే. టీమ్‌ఇండియా పేలవ ప్రదర్శనపై విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో భారత క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో పాటు పలువురు ప్రముఖులు టీమ్‌ఇండియాకు మద్దతుగా నిలిచారు.

ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లే భారత్ నంబర్‌వన్ ర్యాంకింగ్ సాధించడంలో కీలకపాత్ర పోషించారన్న విషయాన్ని మర్చిపోకూడదు. పరిస్థితులు మనకు కఠిన సవాల్ విసిరినప్పుడు వారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇది మన జట్టు. అని రోహిత్ శర్శ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

రోహిత్ చేసిన ట్వీట్‌ను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ రీట్వీట్ చేశారు. రోహిత్ నీవు చేసిన‌ వ్యాఖ్య‌ల‌ను నేను సమర్థిస్తాను. కమాన్ ఇండియా.. మనం సాధించగలం. అని భారత్ శిబిరంలో అమితాబ్ ఉత్సాహాన్ని నింపారు.

ప్రస్తుత పిచ్‌పై బ్యాటింగ్ చేయడం చాలా సవాల్‌తో కూడుకున్నది. పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఇంగ్లాండ్ గొప్పగా బౌలింగ్ చేసింది. క‌ష్ట‌మైన ప‌రిస్థితుల‌లో ప్రత్యర్థి మంచి బౌలింగ్‌తో ఎదురుదాడి చేస్తున్న సమయంలోనే బాగా రాణించడమే బ్యాట్స్‌మన్‌కు సిసలైన పరీక్ష. అని సెహ్వాగ్ తన ట్విటర్‌లో పేర్కొన్నాడు.2262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles