ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ చాంప్ ఫెద‌ర‌ర్‌

Sun,January 28, 2018 05:15 PM

Roger Federer wins his sixth Australian Open title by beating Marin Cilic in Final

మెల్‌బోర్న్ః స్విస్ మాస్ట‌ర్, డిఫెండింగ్ చాంపియ‌న్‌ రోజ‌ర్ ఫెద‌ర‌ర్ ఆరోసారి ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెలిచాడు. ఇవాళ జ‌రిగిన ఫైన‌ల్లో ఆరోసీడ్ మారిన్ సిలిచ్‌పై 6-2, 6-7, 6-3, 3-6, 6-1 తేడాతో ఐదు సెట్ల‌పాటు పోరాడి విజ‌యం సాధించాడు ఫెడెక్స్‌. కెరీర్‌లో అత‌నికిది 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావ‌డం విశేషం. ఇక ఆరుసార్లు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెలిచిన రాయ్ ఎమ‌ర్స‌న్‌, నొవాక్ జొకోవిచ్‌ల స‌ర‌స‌న ఫెడెక్స్ నిలిచాడు. సుమారు మూడున్న‌ర గంట‌ల పాటు హోరాహోరీగా సాగిన ఈ ఫైన‌ల్లో విజ‌యం కోసం ఫెద‌ర‌ర్ చెమ‌టోడ్చాల్సి వ‌చ్చింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచి టైటిల్ వేట మొద‌లుపెట్టిన ఫెడెక్స్‌.. త‌ర్వాతి సెట్‌ను టైబ్రేక‌ర్‌లో కోల్పోయాడు. ఇక మూడో సెట్‌లో సిలిచ్ సర్వీస్ బ్రేక్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఈ స్విస్ మాస్ట‌ర్‌.. ఆ త‌ర్వాత త‌న స‌ర్వీస్‌ల‌ను డిఫెండ్ చేసుకొని 6-3తో ఆ సెట్ కైవ‌సం చేసుకున్నాడు. నాలుగో సెట్‌లో సిలిచ్ మ‌ళ్లీ పుంజుకున్నాడు. కీల‌క‌మైన స‌మ‌యంలో ఫెద‌ర‌ర్ స‌ర్వీస్ బ్రేక్ చేసి 6-3 ఆ సెట్ గెలిచాడు. దీంతో మ్యాచ్ నిర్ణ‌యాత్మ‌క ఐదో సెట్‌లోకి వెళ్లింది. ఈ సెట్‌లో ఫెడెక్స్ త‌న విశ్వ‌రూపం చూపించాడు. ప్ర‌త్య‌ర్థికి ఏమాత్రం చాన్సివ్వ‌కుండా సునాయాసంగా పాయింట్లు సాధిస్తూ వెళ్లాడు. ఈ క్ర‌మంలో రెండుసార్లు సిలిచ్ స‌ర్వీస్ బ్రేక్ చేశాడు. గ‌తేడాది కూడా త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి ర‌ఫెల్ న‌డాల్‌ను ఓడించి ఫెద‌రర్ టైటిల్ గెలిచిన విష‌యం తెలిసిందే. గ‌తంలో 2004, 2006, 2007, 2010, 2017ల‌లోనూ ఫెద‌ర‌ర్ ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్స్ గెలిచాడు.
1999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS