17 ఏళ్ల తర్వాత ఫెదరర్ బ్రేక్

Fri,May 20, 2016 02:13 PM

Roger Federer ends 16-year grand slam streak, to take break from French open

పారిస్ : గత కొన్నేళ్లుగా గ్రాండ్‌స్లామ్ టెన్నిస్‌లో రోజర్ ఫెదరర్ లేని టోర్నీ లేదు. 17 ఏళ్ల తర్వాత స్విస్ మాస్టర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలకు బ్రేక్ తీసుకుంటున్నారు. మేజర్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌కు ఫెడెక్స్ దూరంకానున్నారు. టెన్నిస్‌లో 17 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలిచిన ఫెదరర్ వెన్ను నొప్పి కారణంగా ఆదివారం ప్రారంభం అయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరం అవుతున్నాడు.

వింబుల్డన్, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ టోర్నీలను గ్రాండ్‌స్లామ్‌గా భావిస్తారు. అయితే ఫెదరర్ తొలిసారి 17 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పాల్గొనడం లేదు. ఇప్పటి వరకు ఫెడెక్స్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 23 సార్లు సెమీస్ వరకు చేరుకున్నారు. వరుసగా 65 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లను ఆడిన ఫెదరర్ చాలా గ్యాప్ తర్వాత మెగా టోర్నీకి దూరం అవుతున్నారు. ఫెదరర్ చివరిసారి 1999లో ఫిట్‌నెస్ లోపం కారణంగా యూఎస్ ఓపెన్‌లో ఆడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ బ్రేక్ తీసుకోలేదు.

పారిస్ అభిమానులకు ఈ సారం దూరం అవుతున్నట్లు ఫెదరర్ తెలిపాడు. మాడ్రిడ్, పారిస్ టోర్నీలకు డుమ్మాకొట్టిన ఫెదరర్ తన ఫెవరేట్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో మళ్లీ మెరిసే అవకాశాలున్నాయి. కొన్నాళ్లూగా ఊరిస్తున్న 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఆ టోర్నీలో అందుకోవాలని ఫెడెక్స్ భావిస్తున్నాడు. రియోలో జరిగే ఒలింపిక్స్‌లోనూ ఫెదరర్ పాల్గోనున్నాడు. లండన్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టిన ఫెదరర్ ఈసారి కూడా విజేతగా నిలుస్తానంటున్నాడు. ఒలింపిక్స్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మార్టినా హింగీస్‌తో ఫెదరర్ జత కట్టనున్నాడు.

2961
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles