కివీస్ ఓపెనర్ క్రికెట్‌కు గుడ్‌బై

Sun,June 10, 2018 11:44 AM

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ హార్డ్‌హిట్టర్ మార్టిన్ గప్తిల్‌తో కలిసి విధ్వంసం సృష్టించిన ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రాబ్ నికోల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నికోల్, గప్తిల్ కలిసి న్యూజిలాండ్‌కు చాలాసార్లు చక్కటి ఆరంభాన్నిచ్చారు. 35ఏళ్ల నికోల్ కివీస్ తరఫున రెండు టెస్టులు, 22 వన్డేలు, 21 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 50ఓవర్ల ఫార్మాట్‌లో రెండు సెంచరీలు సాధించి 941 పరుగులు చేశాడు.


అరంగేట్ర వన్డే మ్యాచ్‌లో జింబాబ్వేపై సెంచరీతో చెలరేగి ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున అరంగేట్రంలోనే శతకం బాదిన రెండో ఆటగాడు నికోల్. అంతకుముందు ఈ రికార్డును ఓపెనర్ మార్టిన్ గప్తిల్ నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో 2010 ఐసీసీ టీ20 వరల్డ్ సందర్భంగా వెస్టిండీస్‌తో మాచ్‌లో అరంగేట్రం చేశాడు. చివరిసారిగా 2013లో శ్రీలంక పర్యటనకు వెళ్లిన కివీస్‌కు నికోల్ ప్రాతినిధ్యం వహించాడు.

4079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles