ధోనీని అధిగమించిన పంత్‌

Mon,October 15, 2018 06:20 PM

Rishabh Pant Surpasses MS Dhoni In This Batting Record

న్యూఢిల్లీ: టెస్టుల్లో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అధిగమించాడు. టెస్టు కెరీర్ ఆరంభంలోనే తన మార్క్ బ్యాటింగ్‌తో పరుగుల వరద పారిస్తున్నాడు. తన తొలి ఐదు టెస్టుల్లో 21ఏళ్ల పంత్ 43.25 సగటుతో 346 పరుగులు చేసి ఆకట్టుకోగా.. ధోనీ తన మొదటి ఐదు టెస్టుల్లో 297 పరుగులతో రాణించాడు. మహేంద్రసింగ్ ధోనీ స్థానాన్ని జట్టులో పంత్ భర్తీ చేయగలడని కొద్దిరోజులుగా మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ గడ్డపై పంత్ అసాధారణ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7న ఓవల్ టెస్టులో 114 పరుగులతో అతడు విజృంభించాడు.

ఈ నేపథ్యంలో అతడు సాధించిన గణాంకాలను ధోనీతో పోల్చుతున్నారు. ధోనీ వారసుడిగా పేరు తెచ్చుకున్న రిషబ్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. టెస్ట్‌ క్రికెటా లేక టీ20నా అన్నట్లు అతని బ్యాటింగ్ సాగుతోంది. ధోనీ తన టెస్టు కెరీర్‌లో 90 టెస్టుల్లో 4876 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు 224. మొత్తం 6 సెంచరీలు 33 అర్ధశతకాలు సాధించాడు.

6401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles