టెస్టుల్లోకి ధోనీ వారసుడి అరంగేట్రం

Sat,August 18, 2018 04:12 PM

 Rishabh Pant set to make debut in third Test

నాటింగ్‌హామ్: భారత క్రికెట్లో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేసేది యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ అని గత కొంతకాలంగా మాజీలు, క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న విషయం తెలిసిందే. ధోనీ వారసుడిగా పేరు తెచ్చుకున్న రిషబ్ ఎట్టకేలకు టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. తాజాగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్‌లో జరుగుతున్న మూడో టెస్టులో సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ స్థానంలో అతడు చోటు దక్కించుకున్నాడు.

సహచరులు ఉత్సాహపరుస్తుండగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి రిషబ్ పంత్ టీమిండియా క్యాప్‌ను అందుకున్నాడు. భార‌త్ త‌ర‌ఫున టెస్టు క్రికెట్ ఆడుతున్న 291వ క్రికెట‌ర్ పంత్ కావ‌డం విశేషం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎక్స్‌ప్లోజివ్ బ్యాట్స్‌మన్‌గా పేరొందిన 20ఏళ్ల రిషబ్ టెస్టుల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెగ్యులర్ ఆటగాడిగా టీమ్‌లో కొనసాగాలని ఆశిస్తున్నాడు. మూడో టెస్టుకు కోహ్లీ జట్టులో మూడు మార్పులు చేశాడు. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది.

5818
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles